Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైఎస్ అవినాశ్ రెడ్డికి నోటీసులు అందించిన పులివెందుల పోలీసులు

Pulivendula police serve notices to YS Avinash Reddy
Advertisement
  • పులివెందులలోని పార్టీ కార్యాలయంలో నోటీసుల అందజేత
  • ర్యాలీలు, నిరసనలు నిర్వహించవద్దని నోటీసులో స్పష్టం చేసిన పోలీసులు
  • స్థానిక ఎన్నికల నేపథ్యంలో సెక్షన్ 144 అమల్లో ఉందన్న పోలీసులు
Advertisement
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో పులివెందులలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నాయని, ఈ క్రమంలో ఎలాంటి ర్యాలీలు, సభలు, నిరసనలు చేపట్టవద్దని ఆ నోటీసులో పోలీసులు స్పష్టం చేశారు.

ఈ ఉదయం పులివెందుల టౌన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పురుషోత్తం రాజు స్థానిక వైసీపీ కార్యాలయంలో అవినాశ్ రెడ్డిని కలిసి ఈ నోటీసును అందజేశారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని పోలీసులు కోరారు.

స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా చూడటంలో భాగంగానే ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని... ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
Advertisement
YS Avinash Reddy
Pulivendula Police
Section 144 Pulivendula
Local Elections Andhra Pradesh
YSRCP MP Notice
Andhra Pradesh Law and Order

More Telugu News